Ticker

6/recent/ticker-posts

ముదినేపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి




 '✍🏼"RSR NEWS""✍🏼

✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao"""  9949291526""✍🏼

 ఏలూరు జిల్లా,ముదినేపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి
ముదినేపల్లి, 
ముదినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, ఆ తండ్రి డాక్టర్ మనోజ్  సహకారాలతో  తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న వెంటనే స్పందించి, తన తండ్రి డాక్టర్ మనోజ్ సహకారంతో రూ.10 వేల ఆర్థిక సహాయంతో బోరింగ్ పంపును ఏర్పాటు చేయించారు.
సోమవారం నాడు అంబుల వైష్ణవి చేతుల మీదుగా బోరింగ్ పంపును ప్రారంభించగా, దీంతో పాఠశాలలోని విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొని చిరంజీవి వైష్ణవి సేవా భావాన్ని అభినందించారు.
అంబుల వైష్ణవి సందేశం
“నా పేరు అంబుల వైష్ణవి. నేను ఏలూరు జిల్లా అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా వైద్య విద్యార్థినిగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న ప్రతి విద్యార్థిని, విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మీరు అందరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మీ భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని గుర్తుంచుకుని పట్టుదలతో ముందుకు సాగాలి.
మీ పాఠశాలలో విద్యకు సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా అవసరాలు ఉంటే వాటిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను. విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. మీరు కూడా అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువుతూ మీ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని వైష్ణవి పేర్కొన్నారు.
విద్యార్థుల సంక్షేమం కోసం వ్యక్తిగతంగా ముందుకు వచ్చి తాగునీటి సౌకర్యాన్ని కల్పించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి చర్యను స్థానికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రశంసించారు.