RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది నామ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
ఏలూరు న్యూస్ రైట్ ప్రతినిధి ::
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
ఏలూరు:
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పద్మశ్రీప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ , రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాప్రతినిధులకు, జిల్లా పరిషత్ అధికారులకు మరియు సిబ్బందికి, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సంతోషాలను నింపాలని పద్మశ్రీ ప్రసాద్ ఆకాంక్షించారు. రాష్ట్రం మరియు జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.....




