అంగన్వాడి కార్యకర్తల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
------ చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్
ఏలూరు,RSR,"srinivas,న్యూస్ ప్రతినిధి ::
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉందని వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు
ఆదివారం పాత్రికేయులతో మాట్లాడుతూ అంగన్వాడీల గౌరవం పెంచిన కూటమి ప్రభుత్వం.. చరిత్రలో నిలిచిపోయేలా గ్రాట్యుటీ మంజూరు
అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి మాటను అక్షరాలా అమలు చేస్తాం! అంగన్వాడీల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం
చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా.. అంగన్వాడీల వేతనాలు రెండుసార్లు పెంచిన అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు
అంగన్వాడీలకు 5G ఫోన్లు, 1వ తేదీనే జీతాలు.. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మరియు చిరు ఉద్యోగుల కష్టాలను గుర్తించి, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోంది.
కూటమి పాలనలో అంగన్వాడీల అభివృద్ధి - ప్రధానాంశాలు:
గ్రాట్యుటీ - ఒక చారిత్రక దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ కలను నిజం చేస్తూ, 2025 బడ్జెట్‌లో ₹20 కోట్లు కేటాయించిన ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం.
డిజిటల్ సాధికారత:* సేవలను వేగవంతం చేసేందుకు ₹75 కోట్ల వ్యయంతో 58,204 మందికి హైటెక్ 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ.
అప్‌గ్రేడ్*: 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చి, అక్కడి కార్యకర్తలకు టీచర్లుగా పదోన్నతి మరియు పూర్తి వేతనం.
ఆర్థిక భరోసా గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల ఇబ్బందులు ఉన్నా, ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు అందేలా శాశ్వత పరిష్కారం.
మౌలిక సదుపాయాలు అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు ఆర్వో ప్లాంట్లు, ఇండక్షన్ స్టవ్‌లు, నాణ్యమైన వంట పాత్రలు మరియు ఆటవస్తువుల సరఫరా.
డిజిటల్ విద్యా విప్లవం అంగన్వాడీ చిన్నారుల కోసం అధునాతన టీవీ లు, ఆకర్షణీయమైన ఆటవస్తువులు, మరియు సులభంగా పాఠాలు నేర్పేందుకు వీలుగా రంగురంగుల చార్టుల ఏర్పాటు.
ఆరోగ్యం & పరిశుభ్రత స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు, ప్రత్యేకంగా నిర్మించిన టాయిలెట్ సౌకర్యాలతో హైజీనిక్ వాతావరణం.
హైటెక్ కిచెన్ అంగన్వాడీ కేంద్రాల్లో పొగలేని వంట కోసం ఇండక్షన్ స్టవ్‌లు, అత్యంత నాణ్యమైన వంట పాత్రల పంపిణీ. సౌకర్యాల మెరుగు తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం ₹86.68 లక్షల నిధుల విడుదల.
వేసవి ఉపశమనం చరిత్రలో తొలిసారిగా టీచర్లు, ఆయాలకు వేసవిలో 15 రోజులు సెలవులు మంజూరు.
కూటమి ప్రభుత్వ నిబద్ధత
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా.. ఉద్యోగుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం 9 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించింది. వేతనాల పెంపుపై కూడా సానుకూల దిశగా అడుగులు పడుతున్నాయి.
అంగన్వాడీలు ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి...

