Ticker

6/recent/ticker-posts

శ్రీపర్రు గ్రామ అభివృద్ధికి గుప్తా ఫౌండేషన్ సేవలు అభినందనీయం రూ.30 లక్షలతో కల్యాణ మండపం నిర్మాణం – మడుపల్లి మోహన గుప్తకు ఘన సన్మానం


RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526
 
శ్రీపర్రు గ్రామ అభివృద్ధికి గుప్తా ఫౌండేషన్ సేవలు అభినందనీయం


రూ.30 లక్షలతో కల్యాణ మండపం నిర్మాణం – మడుపల్లి మోహన గుప్తకు ఘన సన్మానం

ఏలూరు జిల్లా, శ్రీపర్రు గ్రామ అభివృద్ధికి సామాజిక సేవా దృక్పథంతో ముందుకు వస్తున్న గుప్తా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
గుప్తా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీపర్రు గ్రామంలో సుమారు రూ.30 లక్షల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కల్యాణ మండపం నిర్మాణం చేపడుతున్న ట్రస్ట్ వ్యవస్థాపకులు మడుపల్లి మోహన గుప్త గారిని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దలు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు శుభకార్యాలు నిర్వహించేందుకు సరైన వేదిక లేక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కల్యాణ మండప నిర్మాణం చేపట్టడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. సామాజిక బాధ్యతతో గ్రామ అభివృద్ధికి ముందుకు వచ్చిన మడిపల్లి మోహన గుప్త సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

మడుపల్లి మోహన గుప్త మాట్లాడుతూ సమాజ సేవే తన లక్ష్యమని, గ్రామ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం గుప్తా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

గ్రామ అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్న గుప్తా ఫౌండేషన్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామ పెద్దలు పూలమాలలు, శాలువాలతో మడిపల్లి మోహన గుప్తను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాదేపల్లి టిడిపి సీనియర్ నాయకులు చింతపల్లి బాలకృష్ణ శ్రీపర్రు గ్రామస్తులు గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు మరియు గుప్తా ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.