Ticker

6/recent/ticker-posts

పేదల ముంగిళ్లలో సంక్షేమ కాంతులు విరియాలనే సంకల్పంతో తన పుట్టినరోజును వేడుకలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలకు అంకితం చేయడం తన జీవితాశయమని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టిడిపి అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తెలిపారు.



 జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


 ఏలూరు  ,RSR,srinivas,  ప్రతినిధి ::


పేదల ముంగిళ్లలో సంక్షేమ కాంతులు విరియాలనే సంకల్పంతో తన పుట్టినరోజును వేడుకలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలకు అంకితం చేయడం తన జీవితాశయమని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టిడిపి అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తెలిపారు. 


గురువారం తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తన పుట్టినరోజు పేదలకు పండుగలా మారాలని ఆశిస్తూ ఎక్కడా ఆడంబరాలకు పోకుండా అవసరార్థులకు సేవలు అందించాలనే సదాశయాన్ని కొనసాగిస్తున్నానన్నారు. బొకేలు, కేక్‌లు, పూలదండలు వంటి వాటిపై ఖర్చు చేసే ప్రతి రూపాయి అవసరంలో ఉన్నవారికి ఆర్థిక భరోసా కలిగేలా వినియోగించాలనే ఉద్దేశంతోనే తాను ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు.


తనను అభిమానించే వారు నిరాశ చెందకూడదనే ఉద్దేశంతో వారిలో సేవాస్ఫూర్తిని పెంపొందించి, విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రేరేపిస్తున్నానన్నారు. గతంలోనూ, ప్రస్తుతమూ తన పిలుపునకు స్పందించి పేదలకు సేవలందించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదే సేవా పరంపరను రానున్న రోజుల్లో మరింత విస్తరించి అవసరార్థుల్లో విశ్వాసం నింపాలని ఆయన ఆకాంక్షించారు.