✍🏼RSR NEWS✍🏼
ఏలూరు మాజీ ఏలూరు ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు మాగంటి వెంకటేశ్వరావు (బాబు) జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ
ఏలూరు:
ఏలూరు మాజీ ఏలూరు పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాహితానికి కట్టుబడి ప్రజాసేవలో అహర్నిశలు శ్రమిస్తున్న మాగంటి వెంకటేశ్వరావు (బాబు) జన్మదినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ — ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న మాగంటి వెంకటేశ్వరావు ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉండి సేవలందిస్తున్న నాయకుడని కొనియాడారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి విశేషమని, ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి ఆయన చూపుతున్న నిబద్ధత ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఇలాంటి సేవాభావం, నిబద్ధతతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలందిస్తూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, విజయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజల మన్ననలు, పార్టీ శ్రేయోభిలాషుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు తోడుగా ఉండాలని అభిలషిస్తూ మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మాగంటి వెంకటేశ్వరావు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆనందోత్సాహ వాతావరణంలో జరిగింది.

