Ticker

6/recent/ticker-posts

గుడివాడలో రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో “బెస్ట్ సోషల్ వర్క్ అవార్డ్స్ – 2026” ఘనంగా నిర్వహణ






 ✍🏼RSR NEWS✍🏼



🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao  9949291526🙏🏼✍🏼

గుడివాడలో రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో “బెస్ట్ సోషల్ వర్క్ అవార్డ్స్ – 2026” ఘనంగా నిర్వహణ


గుడివాడలోని ఎ.పి.ఎన్.జి.ఓస్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో “బెస్ట్ సోషల్ వర్క్ అవార్డ్స్ – 2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న పలువురిని ఈ సందర్భంగా సన్మానించారు. సేవాభావం, ప్రజలకు అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తిస్తూ నంది అవార్డులు మరియు బెస్ట్ సోషల్ వర్క్ అవార్డులను ప్రదానం చేసి, సాలువాలతో ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు.


ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రితిక ఫౌండేషన్ చేస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. ముఖ్యంగా అనాధ పిల్లల పట్ల వారు చూపుతున్న సేవాభావం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజ సేవ మరియు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి సన్మానించడం పట్ల స్థానికులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

అదేవిధంగా డాక్టర్ మనోజ్ మరియు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పేదలకు చేస్తున్న నిస్వార్థ సేవలను వక్తలు ప్రశంసించారు. రాజకీయ నాయకులు మాటల్లోనే ఉంటారని, కానీ డాక్టర్ మనోజ్ మాటలకంటే చేతల్లోనే సేవ చూపిస్తున్నారని పేర్కొన్నారు. వైష్ణవి చిన్ననాటి నుంచే సేవాభావంతో వైద్య విద్యను అభ్యసిస్తూ, భవిష్యత్తులో సమాజానికి అంకితమవ్వాలనే తపనతో ఉన్నారని కొనియాడారు.

కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన డాక్టర్ మనోజ్ మరియు అంబుల వైష్ణవి అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ ద్వారా రూ.116 విరాళం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు స్వచ్ఛందంగా స్కాన్ చేసి విరాళాలు అందజేయగా, వారికి డాక్టర్ మనోజ్ మరియు వైష్ణవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లాకు చెందిన జర్నలిస్ట్ మరియు సోషల్ వర్కర్ చింతపల్లి శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత సుమారు 20 సంవత్సరాలుగా వివిధ శాటిలైట్ ఛానళ్లలో పనిచేస్తూ, ప్రస్తుతం పత్రికలో స్టాఫ్ రిపోర్టర్‌గా సేవలందిస్తున్న ఆయన సమాజ సేవలో చూపుతున్న కృషిని గుర్తించి “బెస్ట్ సోషల్ వర్క్ అవార్డు – 2026”తో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు మెమెంటో, బొకే, ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా అభినందించారు.