RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
పెద్ద తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
పెద్ద తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించారు.
దర్శనానంతరం ఎమ్మెల్యే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ద్వారా తిరిగి చింతలపూడి నియోజకవర్గానికి ప్రయాణమయ్యారు.



