Ticker

6/recent/ticker-posts

ఏలూరు నగరంలోని శ్రీ భారతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026లో అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగరేశారు





 
RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

ఏలూరు నగరంలోని శ్రీ భారతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026లో అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగరేశారు

 ఏలూరు  "" RSR""న్యూస్ ప్రతినిధి ::::::::


ఏలూరు నగరంలోని శ్రీ భారతి జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026లో అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగరేశారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ నానాజీ  అకడమిక్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు విలేకరులతో మాట్లాడారు.
వారు మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడం ఎంతో గర్వకారణమని తెలిపారు. సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో ఎంపీసీ గ్రూప్‌కు చెందిన సిహెచ్ అమూల్య 986 మార్కులు సాధించి కాలేజీకి కీర్తి తెచ్చిందని చెప్పారు. అలాగే బైపీసీ విభాగంలో చిల్లి ముంతల హర్షిత 983 మార్కులు సాధించి విశిష్ట ప్రతిభ కనబరిచిందని వెల్లడించారు.
జూనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో ఎంపీసీ గ్రూప్‌కు చెందిన హిత్ గణేష్ 466 మార్కులు, వంగపండు లావణ్య 465 మార్కులు సాధించి మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు. అదేవిధంగా, ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో విద్యార్థులు 900 పైగా మార్కులు సాధించగా, జూనియర్ ఇంటర్‌లో కూడా 460 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.
ఈ విజయానికి ప్రధాన కారణం విద్యార్థుల కష్టపడి చదవడం, అధ్యాపకుల నిబద్ధతతో కూడిన బోధన, తల్లిదండ్రుల సహకారం అని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కాలేజీ ఎల్లప్పుడూ నాణ్యమైన విద్యను అందించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ అన్నపనేని రవికుమార్  ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు......