RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
Editor: Chintapalli Srinivasarao 9949291526
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆదనుసారం ఏలూరు మండలం మాదేపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహణ
ఏలూరు న్యూస్ రైట్ ప్రతినిధి :::+
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో
ఏలూరు మండలం మాదేపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహణ
ఏలూరు మండలం మాదేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మాదేపల్లి సచివాలయం ప్రత్యేక అధికారి మరియు ఏలూరు మండల అభివృద్ధి అధికారి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ఏలూరు గ్రామీణ మండల తహసీల్దార్, జాలిపూడి సహకార సంఘం అధ్యక్షులు, జనసేన నాయకులు మోటుపల్లి పవన్ హరిశ్చంద్ర కుమార్, మాదేపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు పైటపాటి శేఖర్, మాదేపల్లి మండల పరిషత్ ప్రాంతీయ సభ్యులు, అలాగే కూటమి నాయకులు, సచివాలయం సిబ్బంది, అధికారులు మరియు గ్రామ ప్రజలు భారీగా హాజరయ్యారు.
గ్రామసభలో పంచాయతీ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజలకు అవసరమైన సేవల విస్తరణ, అభివృద్ధి పనుల అమలు వంటి అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
అలాగే, 2007 జనగణనకు ముందు నిర్మితమైన ఇళ్ల జాబితా ధృవీకరణకు సంబంధించిన స్వయంనమోదు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించారు.
ఈ గ్రామసభ ద్వారా ప్రజల సమస్యలు, అవసరాలు నేరుగా తెలుసుకొని, పరిష్కార మార్గాలు సూచించడంలో అధికారులు ముందడుగు వేశారు......





