'✍🏼"RSR NEWS""✍🏼
✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao""" 9949291526""✍🏼
ఏలూరు, జూలై 19: రానున్న వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏలూరు జిల్లా, పట్టణ కమిటీ సభ్యులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)ని మర్యాదపూర్వకంగా కలిసి వినాయక మండపాలకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు, ఇతర ఏర్పాట్ల విషయంలో సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను కులమతాలకు అతీతంగా, పర్యావరణహితంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు టిడిపి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య దుశాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా, పట్టణ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.



