Ticker

6/recent/ticker-posts

ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి 62వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బడేటి బుజ్జి విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి చంటి, రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకట్రామయ్య, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు





'✍🏼"RSR NEWS""✍🏼

✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao"""  9949291526""✍🏼

 


ఏలూరు జిల్లా ఏలూరు నగరం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం,పార్టీ కార్యకర్తలకు, తమను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడం బడేటి కుటుంబ సంప్రదాయమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. మాజీ ఎమ్మెల్యే, దివంగత బడేటి బుజ్జి చూపిన సేవా మార్గంలో తాను కూడా ముందుకు సాగుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు.

ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి 62వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బడేటి బుజ్జి విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి చంటి, రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకట్రామయ్య, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
 అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహానికి కూడా పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ప్రజాసేవ చేయడం తమ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించిన వరమని అన్నారు. బడేటి బుజ్జి ప్రజల మధ్యే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఏలూరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని తెలిపారు.
రాజకీయాల్లో నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవే విజయానికి మూలమని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రభుత్వం చేపడుతున్న ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ పూర్తైన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని, నగరంలోని 62 డివిజన్లలో కూటమి జెండా రెపరెపలాడేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కుటుంబ సభ్యుల్లా కలిసికట్టుగా పనిచేయడమే తమ విజయ రహస్యమని పేర్కొన్న ఆయన, అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని కోరారు. ప్రజలకు సేవ చేసే విషయంలో తనతో పాటు నిరంతరం శ్రమిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్యాలయ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఉపాధి కోసం తన సొంత నిధులతో సమకూర్చిన తోపుడు బండిని ఒక లబ్ధిదారునికి ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, జిల్లా టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, నాయకులు మోటేపల్లి చంద్రశేఖర్, బెల్లపుకొండ కిషోర్, ఈతకోట శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, డివిజన్ ఇన్‌చార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.