'✍🏼"RSR NEWS""✍🏼
✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao""" 9949291526""✍🏼
✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao""" 9949291526""✍🏼
ఏలూరు రూరల్ మండల టిడిపి అధ్యక్షుడిగా నేతల రవికి అభినందనలు, మాదేపల్లి శెట్టి బలిజ కమ్యూనిటీ పెద్దలు.
ఏలూరు" RSR""న్యూస్ చింతపల్లి శ్రీనివాస్ మాదేపల్లి ప్రతినిధి::
దెందులూరు, ఏలూరు మండలం, మాదేపల్లి గ్రామం:
దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఆశీస్సులతో ఏలూరు రూరల్ మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నేతల రవి కి మాదేపల్లి గ్రామ శెట్టి బలిజ కమిటీ పెద్దలు ఘనంగా సన్మానించి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శెట్టి బలిజ కమిటీ పెద్దలు మాదేపల్లి మూడో వార్డు మాజీ వార్డ్ మెంబర్ చింతపల్లి బేబీ సరోజిని సత్యనారాయణ, మాదేపల్లి మాజీ ""బిసి అధ్యక్షులు"" మరియు "కేకే మెడికల్ "అధినేత డాక్టర్ చింతపల్లి రవిచంద్ర కుమార్,"" సింహం రామకృష్ణ, "కోడి నాగు, నాగ వెంకట సత్యనారాయణ ""తదితర గ్రామ పెద్దలు పాల్గొని నేతల రవిని శాలువాతో సత్కరించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన బాధ్యతలు చేపట్టిన నేతల రవి పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతం మరియు మండల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి సేవలందిస్తూ పార్టీకి మరింత మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ శ్రేయోభిలాషులు నేతల రవికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
"ప్రజా సేవే పరమావధి – పార్టీ అభివృద్ధియే లక్ష్యం" అనే నినాదంతో ముందుకు సాగి ప్రజల ఆదరణను మరింతగా పొందాలని ఆకాంక్షిస్తూ నేతల రవికి మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
మాదేపల్లి శెట్టి బలిజ కమ్యూనిటీ పెద్దలు.






