Ticker

6/recent/ticker-posts

ఏలూరు నగరంలోని “ కొత్త బస్టాండ్ ఎదురుగా నాయుడు వంటిల్లు” నూతన షోరూం రంగ రంగ వైభవంగా ప్రారంభం






 

RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

ఏలూరు నగరంలోని  “ కొత్త బస్టాండ్ ఎదురుగా నాయుడు  వంటిల్లు” నూతన షోరూం రంగ రంగ వైభవంగా  ప్రారంభం

ఏలూరు నగరం, కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్‌లో “నాయుడు గారి వంటిల్లు” అనే నూతన వ్యాపార షోరూం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఏలూరు నగర డిప్యూటీ మేయర్ వందనాల శ్రీనివాసరావు, ప్రముఖుడు టిడిపి నాయకులు  నాయుడు సోము ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ప్రారంభానికి ముందు షోరూం నిర్వాహకులు సింహాద్రి బాలు మరియు వారి కుటుంబ సభ్యులు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ మేయర్ వందనాల శ్రీనివాసరావు, టిడిపి నాయకులు నాయుడు సోము కూడా పూజల్లో పాల్గొని, నూతన వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు సింహాద్రి బాలు మాట్లాడుతూ, “నాయుడు గారి వంటిల్లు”లో ఏలూరు జిల్లా ప్రజలకు కావలసిన అన్ని రకాల సౌత్ ఇండియన్ వంటకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. శుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన పదార్థాలతో తయారు చేసిన రుచికరమైన వంటకాలు తక్కువ ధరల్లో అందిస్తామని చెప్పారు.

పెద్దలు, పిల్లలు అందరికీ నోరూరించే రుచులతో ప్రత్యేకమైన ఆహార పదార్థాలను అందించడం మా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, అభిమానులు, ప్రాంతీయ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.