Editor: Chintapalli Srinivasarao 9949291526
ఏలూరులో రాష్ట్రస్థాయి రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహణ
ఏలూరు నగరంలోని సత్రంపాడు ప్రాంతంలో ఉన్న సిద్ధార్థ విద్యాలయంలో రాష్ట్రస్థాయి నాలుగవ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 113 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అకాడమీ కోచ్ గంజి యోహాను మాట్లాడుతూ, చెస్ పోటీల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను గుర్తించి, వారి భవిష్యత్ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. అలాగే ఈ పోటీలలో విజేతలకు రూ.25,000 వరకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, షీల్డులు అందజేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన సిద్ధార్థ విద్యాలయ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, చెస్ క్రీడ వల్ల పిల్లల్లో మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా, ఆలోచనా శక్తి మరియు ప్రతిభ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ
విజయానికి కోచ్ గంజి యోహాను చేసిన కృషి ఎంతో ఉందని వారు అభినందించారు.






