Editor: Chintapalli Srinivasarao 9949291526
అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి , ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ చేతుల మీదగా తక్షణం సాయం రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఏలూరు జిల్లా ముదినేపల్లి కాలనీలో ఈరోజు తెల్లవారుజామున దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ముదినేపల్లి సచివాలయంలో పనిచేస్తున్న మద్దాల వెంకటేశ్వరరావు గారు (55) అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కుటుంబం ఆర్థికంగా బలహీన స్థితిలో ఉండటంతో అంత్యక్రియల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న అమరావతి అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి , తండ్రి డాక్టర్ మనోజ్ చేతుల మీదుగా రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయం ద్వారా కుటుంబానికి కొంత ఉపశమనం లభించింది.
స్థానికులు అంబుల వైష్ణవి సేవా భావాన్ని అభినందిస్తూ, ఇలాంటి సహాయం అవసరమైన వారికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.


