Ticker

6/recent/ticker-posts

అమరావతి రాజధాని రైతుల కోసం అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పాదపూజ గ్రామాల్లో చైతన్య యాత్ర – వెంకటపాలెంలో విశేష స్పందన






 అమరావతి రాజధాని   రైతుల కోసం అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పాదపూజ    గ్రామాల్లో చైతన్య యాత్ర – వెంకటపాలెంలో విశేష స్పందన

అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెం గ్రామంలో ఈరోజు అమరావతి అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి పిలుపుమేరకు, ఆమె తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ ఆధ్వర్యంలో “చేయి చేయి కలుపుదాం – అమరావతి రాజధానికి ₹116 సాయం చేద్దాం” అనే వినూత్న కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై విశేషంగా స్పందించారు. ముఖ్యంగా మహిళలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. స్థానికులు తమ వంతు సహాయం అందిస్తూ అమరావతి రాజధాని నిర్మాణానికి మద్దతు ప్రకటించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అంబుల మనోజ్ మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్మాణం ప్రజల ఆశయంగా నిలవాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరించేందుకు అమరావతి పరిధిలోని 29 గ్రామాలను పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నామని పేర్కొన్నారు.
ఇక ప్రజల నుండి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ పాదపూజలు నిర్వహించడం ద్వారా వారి సేవా భావాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. ఈ పాదపూజల ద్వారా గ్రామస్థుల్లో మరింత చైతన్యం పెరుగుతోందని, అమరావతి నిర్మాణం పట్ల ప్రజల్లో విశ్వాసం, బాధ్యత పెరుగుతోందని అన్నారు.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం గ్రామస్థులు చూపుతున్న ఐక్యత, సేవా భావం అభినందనీయమని, ఈ కార్యక్రమం మరిన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.