RSR NEWS
సొంగా రోషన్ కుమార్ గ చేతుల మీదుగా చింతలపూడి మండల మరియు పట్టణానికి చెందిన 13 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మొత్తం రూ.5,26,537/- (ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు) విలువైన చెక్కులను పంపిణీ
ఏలూరు,RSR,న్యూస్ ప్రతినిధి :చింతలపూడి / ఏలూరు జిల్లా
చింతలపూడి శాసనసభ్యుల కార్యాలయంలో శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా చింతలపూడి మండల మరియు పట్టణానికి చెందిన 13 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మొత్తం రూ.5,26,537/- (ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు) విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, అలాగే సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ సమయంలో సహకరించిన రిఫరీలు పాల్గొని లబ్ధిదారులతో కలిసి చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ,
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, పూర్తిగా పారదర్శకంగా, నేరుగా తమ చేతులకు చెక్కులు అందజేస్తున్నందుకు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.




