Editor: Chintapalli Srinivasarao 9949291526
చింతమనేనిలో ఉన్న గొప్ప నాయకత్వ లక్షణాలు స్ఫూర్తిదాయకం
ఏలూరు,, RSR,న్యూస్ srinivas :: చింతమనేనిలో ఉన్న గొప్ప నాయకత్వ లక్షణాలు స్ఫూర్తిదాయకం": దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్.
ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి అంశంలో దెందులూరుదే అగ్రస్థానం - ప్రజా సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి స్పందించే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ - ఆయనకున్న నాయకత్వ లక్షణాలు ఎంతో గొప్పవి, ఎంతోమంది యువ నాయకులకు అవి స్ఫూర్తిదాయకం - ఎంపీ లాండ్స్ ద్వారా శంకుస్థాపన చేపట్టే ప్రతి పనిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ": ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడి
దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడి గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలిసి ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, నెక్ట్స్ జెన్ సంస్థల అధినేత అడుసుమిల్లి సుబ్రమణ్యం *
ఏలూరు రోడ్ల మండలం జాలిపూడి గ్రామంలో 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన మరియు రూ.51 లక్షల రూపాయలతో చేపట్టిన ఫిల్టర్ బెడ్ల నిర్మాణం మరియు (ఓ హెచ్ ఆర్ ఎస్ ) నిర్మాణంలో ఫిల్టర్ బెడ్ నిర్మాణం పూర్తికాగా వాటిని ప్రారంభించి అలాగే, 90,000 లీటర్ల సామర్థ్యం కలిగిన నూతన ఓవర్ హైడ్ రిజర్వాయర్ సిస్టం కు శంకుస్థాపన చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ , దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , నెక్స్ట్ జెన్ సంస్థల అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం .*
జాలిపూడి గ్రామంలోని వెలమపేటలో స్థానిక ప్రజల చిరకాల కోరిక అయిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవతో రూ.20లక్షల రూపాయల ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు మంజూరు చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ , భవన నిర్మాణానికి అవసరమైన మరో 10 లక్షల రూపాయలను సైతం తాను అందిస్తానంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామాభివృద్ధికి దోహదపడిన అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం
ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ , దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , పారిశ్రామికవేత్త సుబ్రహ్మణ్యం పుష్ప గుచ్చాలను, అందించి శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికిన స్థానిక కూటమి నాయకులు.
ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ "ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా చేపట్టిన ప్రతి పనిని కూడా నిర్దేశిత సమయంలోగా పూర్తిచేసే విధంగా చర్యలు చేపడుతున్నామని, మంజూరు చేసిన ప్రతి పనిని కూడా ఆరు నెలల కాలం నుంచి ఏడాది కాలంలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే విధంగా పనుల స్థితిగతులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.. తన ఏలూరు పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాల్లో దెందులూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ప్రథమ స్థానంలో ఉంటుందని , ప్రజలకు ఏదైనా సమస్య వస్తే అది తన సొంత సమస్యగా భావించి వాటి పరిష్కారం కోసం స్పందించే వ్యక్తిగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిపాలనందిస్తుంటారని, ఎంతోమంది ప్రముఖులకు శాలువాలు వస్తుంటాయని కానీ వాటిని బట్టలుగా కుట్టించి చిల్డ్రన్ హోమ్ లో ఉంటున్న పిల్లలకు అందించాలని ఆటువంటి ఆలోచన రావడం ఎంతో అభినందనీయమని , అదే విధంగా చింతమనేని ప్రభాకర్ లో ఎన్నో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అటువంటి నాయకత్వం లక్షణాలు చూసి యువనాయకులు కూడా స్ఫూర్తి పొందాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు..*
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాలలో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, జాలిపూడి గ్రామంలో శంకుస్థాపన చేసిన పనులు కూడా సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో వచ్చేలా కృషి చేస్తామని , అదేవిధంగా దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపి లాండ్స్ నిధుల ద్వారా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ , మరియు జాలిపూడి గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్న దాత నెక్స్ట్ జెన్ సంస్థల అధినేత అడుసుమిల్లి సుబ్రమణ్యం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, క్లస్టర్ ఇంచార్జ్ నేతల రవి సహా పలువురు కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు





