RSR NEWS
Editor: Chintapalli Srinivasarao
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ కారుణ్య నియామకాలు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో ఇటీవల మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలుస్తూ, జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ఈ రోజు కారుణ్య నియామకాలు (Compassionate Appointments) కింద అర్హత గల 13 మంది మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు నియామక ఉత్తర్వులను చైర్‌పర్సన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉద్యోగి మరణం కుటుంబానికి తీరని లోటు అని, అటువంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
నియామక ఉత్తర్వులు పొందిన నూతన ఉద్యోగులు ప్రజాసేవనే లక్ష్యంగా తీసుకుని, అత్యంత నిజాయితీగా విధులు నిర్వర్తించాలని పద్మశ్రీ ప్రసాద్ చైర్‌పర్సన్ సూచించారు. జిల్లా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా బాధ్యతాయుతంగా పని చేయాలని ఆమె అన్నారు.
కారుణ్య నియామకాలు బాధిత కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించి, వారి జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా జిల్లా ప్రజా పరిషత్ ఎప్పటికప్పుడు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.