ఏలూరు/నూజివీడు, డిసెంబరు 19: నూజివీడు రాష్ట్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 6 గంటలు వరకు జరిగిన ప్రజాధర్బార్ లో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని 36 అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను మంత్రి కొలుసు పార్థసారథి అక్కడికక్కడే పరిష్కారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా ధర్భార్ నిర్వహించి, ప్రజలు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రమంత్రులు, శాసన సభ్యులు తప్పక ప్రజాదర్భారు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వారం వారం ప్రజాధర్బార్ నిర్వహిస్తున్నామని అన్నారు. వచ్చిన ధరఖాస్తులను నిర్ణీత సమయంలో అధికారులు పరిష్కారం చెయ్యాలని, అధికారులు పరిధిలో లేని సమస్యలను నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధిత వివిధ శాఖలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ప్రజాధర్భార్లో 36 అర్జీలు, సంబంధిత అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

