Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని కమిటీ సభ్యుడు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్. శంకరరావు తెలిపారు




 ✍🏼RSR NEWS✍🏼

🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao  9949291526🙏🏼✍🏼

 జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి   బొకే అందజేస్తున్న కె.ఎస్. శంకరరావు మరియు కమిటీ సభ్యులు.


జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 05:
ఏలూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని కమిటీ సభ్యుడు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్. శంకరరావు తెలిపారు,. సమాచారశాఖ జాబితా ప్రకారం దాదాపు అన్ని మీడియా ప్రతినిధుల పేర్లను జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్‌పర్సన్ కె. వెట్రి సెల్వి స్వీకరించారని ఆయన పేర్కొన్నారు.
గురువారం సమావేశం వివరాలను వెల్లడిస్తూ, ఏలూరు జిల్లాలో కొన్ని అదనపు సెంటర్ల ఏర్పాటుకు కమిటీ ప్రతిపాదన చేయగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పేర్లకు రెండు రోజుల గడువు ఇచ్చి, మిగిలిన వాటిని సెకండ్ లిస్ట్‌కు సిద్ధం చేయాలని కలెక్టర్ ఏ.డి.ను ఆదేశించినట్లు చెప్పారు.
ఎవరిపై కేసులు ఉన్నాయా అనే అంశంపై విచారణ అనంతరం జాబితా ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు, బస్ పాస్‌లు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారని తెలిపారు. చిన్న కేసులు ఉన్నా ఇబ్బంది ఉండదని, రెండు మూడు రోజుల్లో పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. రైల్వే పాస్‌ల విషయమై కమీషనర్ మరియు ఎంపీతో మాట్లాడతానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు శంకరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అనుబంధం ఏపిబిజేఏ సభ్యుడు పి. కళ్యాణ్ కుమార్, గుర్తింపు పొందిన జర్నలిస్టు యూనియన్ల సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.