Ticker

6/recent/ticker-posts

ఉంగుటూరు, భీమడోలు: ఉంగుటూరు నియోజకవర్గం, భీమడోలు మండలంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు.



 ✍🏼RSR NEWS✍🏼

🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao  9949291526🙏🏼✍🏼

ఉంగుటూరు, భీమడోలు:

ఉంగుటూరు నియోజకవర్గం, భీమడోలు మండలంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు.


ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినీ-విద్యార్థులతో స్నేహపూర్వకంగా ముచ్చటించి, వారి విద్యా ప్రగతిపై ఆరా తీశారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి, పాఠశాలలో అమలవుతున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తరగతులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే అంశంపై వివరాలు తెలుసుకున్నారు.


అలాగే ప్రభుత్వ పథకాలలో భాగంగా బాలికలకు అందిస్తున్న ఐరన్ టాబ్లెట్లు, రాగి జావను క్రమం తప్పకుండా తీసుకుంటున్నారా అనే విషయంపై విద్యార్థులతో చర్చించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచనలు చేశారు.

అనంతరం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజన నాణ్యత, తయారీ విధానం, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.