Ticker

6/recent/ticker-posts







 బడేటి రాధాకృష్ణయ్య (చంటి) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
 
ఏలూరు,RSR,srinivas, న్యూస్  ప్రతినిధి::: 

ఏలూరు నగరంలోని 23వ డివిజన్ కార్పొరేటర్  కలవకొల్లు సాంబ  ఆధ్వర్యంలో, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఏలూరు శాసనసభ్యులు  బడేటి రాధాకృష్ణయ్య (చంటి) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గారు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజాసేవలో ఆయన అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవచేసే శక్తి, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

అనంతరం నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు చేతికర్రలు పంపిణీ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమం కోసం ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.