Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా మీడియా మిత్రుల సమక్షంలో జర్నలిస్ట్ చింతపల్లి శ్రీనివాస్ ఘనంగా సత్కరించి అభినందించారు




 ✍🏼RSR NEWS✍🏼

🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao  9949291526🙏🏼✍🏼

ఏలూరు జిల్లా మీడియా మిత్రుల సమక్షంలో జర్నలిస్ట్ చింతపల్లి శ్రీనివాస్ ఘనంగా సత్కరించి అభినందించారు


ఏలూరు జిల్లా
రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు జిల్లా న్యూస్ రైట్ స్టాఫ్ రిపోర్టర్ శ్రీ చింతపల్లి శ్రీనివాస్ గారు “సోషల్ వర్కర్ అవార్డు” అందుకున్నారు. 

సమాజ సేవలో ఆయన చూపుతున్న నిబద్ధత, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఈరోజు ఏలూరు జిల్లా మీడియా మిత్రుల సమక్షంలో చింతపల్లి శ్రీనివాస్ ఘనంగా సత్కరించి అభినందించారు. సహచర పాత్రికేయులు, స్నేహితులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అవార్డు స్వీకరించిన అనంతరం చింతపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ —
సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా పనిచేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఈ గౌరవం నాకు మరింత బాధ్యతను పెంచింది. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మరియు రితిక ఫౌండేషన్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
ఇట్లు
చింతపల్లి శ్రీనివాస్
న్యూస్ రైట్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్.