Ticker

6/recent/ticker-posts

రైతు సంక్షేమం కోసం తపిస్తూ, సహజ సిద్ధ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, భూసారాన్ని రక్షించాలనే లక్ష్యంతో శ్రీశ్రీశ్రీ మన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ వారు చేపట్టిన సుఫల రైతు పాదయాత్ర ఎంతో అభినందనీయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

 ✍🏼RSR NEWS✍🏼

🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao  9949291526🙏🏼✍🏼

చిన్నజీయర్ స్వామీజీకి ఎమ్మెల్యే చింతమనేని పాదపూజ

రైతు సంక్షేమం కోసం తపిస్తూ, సహజ సిద్ధ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, భూసారాన్ని రక్షించాలనే లక్ష్యంతో శ్రీశ్రీశ్రీ మన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ వారు చేపట్టిన సుఫల రైతు పాదయాత్ర ఎంతో అభినందనీయమని దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  తెలిపారు.

పెదవేగి మండలంలోని వంగూరు, కవ్వగుంట, గార్లమడుగు, లక్ష్మీపురం గ్రామాల్లో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సుఫల రైతు పాదయాత్ర కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామీజీ వారి పాద పద్మములకు పుష్పాలు సమర్పించి నమస్కరించారు. అనంతరం ఇద్దరూ ఆప్యాయంగా కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ — ఆధ్యాత్మిక సందేశాలతో పాటు రైతు సంక్షేమం, భూసారం పరిరక్షణ, ప్రకృతి సేద్యం ప్రాముఖ్యతపై చిన్న జీయర్ స్వామీజీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించడం, గో సంరక్షణ, సహజ వ్యవసాయం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా చేపట్టిన ఈ సుఫల రైతు పాదయాత్ర ఎంతో ప్రభావవంతంగా ఉందన్నారు.

కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, చిన్న జీయర్ స్వామీజీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.