Ticker

6/recent/ticker-posts

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు నగరంలోని పడమర వీధిలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు





 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao

వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఏలూరు, డిసెంబర్ 30:

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు నగరంలోని పడమర వీధిలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ ప్రత్యేక పూజల్లో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో

 ఈడచైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్,

 ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి ,

తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం ,

డివిజన్ ఇన్‌చార్జ్ వీరంకి త్రినాథ్ ,

ఆలయ చైర్మన్ వీరమాచినేని చందు ,

ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడగా, ప్రత్యేక అలంకరణలు మరియు ఆధ్యాత్మిక వాతావరణం ఆకట్టుకున్నాయి...