ఏలూరులో ఘనంగా గంగానమ్మ–ఆదిమహాలక్ష్మమ్మ–వినుకొండ అంకమ్మ జాతర
జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ… అమ్మవార్లకు సారె, చీర, పసుపు–కుంకుమ సమర్పణ
ఏలూరు:
ఏలూరు నగరంలో నిర్వహిస్తున్న శ్రీ గంగానమ్మ, ఆదిమహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ తల్లులు మరియు పోతురాజు బాబు జాతర సందర్భంగా దక్షిణపు వీధి జాతర కమిటీ ఆహ్వానం మేరకు దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు, కొఠారు లక్ష్మీ నేతృత్వంలో నాలుగు మండలాలకు చెందిన జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంప్రదాయ వేషధారణలో, భక్తిశ్రద్ధలతో జాతర మేడల వద్దకు చేరుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ర్యాలీ అనంతరం
దక్షిణపు వీధి జాతర మేడల వద్ద,
పాత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద,
పడమర వీధి జాతర మేడల వద్ద
అమ్మవార్లకు సారె, చీర, పసుపు–కుంకుమలను భక్తిపూర్వకంగా సమర్పించారు. ఈ సందర్భంగా గంగానమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ఏలూరు నగరం సుభిక్షంగా, సుఖశాంతులతో ఉండాలని జనసేన నాయకులు ఆకాంక్షించారు.
జాతర ప్రాంగణమంతా భక్తుల నినాదాలు, పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, జనసేన నాయకుల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానికులు, జాతర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు





