RSR NEWS
ఏలూరు జిల్లా శెట్టిబలిజ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యుల ఏలూరు శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం నాయకులు, బడేటి రాధాకృష్ణయ్య కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు,
ఏలూరు జిల్లా శెట్టిబలిజ సంక్షేమ సంఘం నూతనంగా ఏర్పడిన జిల్లా కార్యవర్గ సభ్యులు మంగళవారం ఉదయం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సమావేశంలో శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం సంఘటితంగా ముందుకు సాగుతూ సంఘ సభ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. సంఘ అభివృద్ధికి కార్యవర్గ సభ్యులందరూ సమిష్టిగా పనిచేసి సంఘానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు వనుము విజయనరసింహారావు,
సంఘ అధ్యక్షులు ఇళ్ళ వరప్రసాద్,
వర్కింగ్ ప్రెసిడెంట్ వసాది శ్రీనివాసరావు,
వైస్ ప్రెసిడెంట్ పంపన వెంకటరమణ,
జాయింట్ సెక్రెటరీ ఇళ్ళ శ్రీనివాస్,
కోశాధికారి గుబ్బల నాగ దుర్గారావు,
న్యాయ సలహాదారు పితాని దుర్గాప్రసాద్,
శెట్టిబలిజ నాయకులు మామిడి శెట్టి సీతారామయ్య, కోడి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

