'✍🏼"RSR NEWS""✍🏼
✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao""" 9949291526""✍🏼
నిరుపేద వృద్ధుల అంత్యక్రియలకు అండగా వైష్ణవి
ఏలూరు "" RSR""న్యూస్ ప్రతినిధి ::
ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం
నిరుపేద వృద్ధుల అంత్యక్రియలకు అండగా వైష్ణవి
వెన్న కమలమ్మ కుటుంబానికి రూ.5,000 సాయం
బొజ్జ మరియమ్మ కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం
డాక్టర్ మనోజ్ ద్వారా నగదు పంపిణీ
ముదినేపల్లి మండలంలోని రెండు గ్రామాల్లో అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద వృద్ధుల కుటుంబాలకు సామాజిక సేవకురాలు, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి మానవత్వాన్ని చాటుతూ ఆర్థిక సహాయం అందించారు.
మండలంలోని దాకారం గ్రామానికి చెందిన వెన్న కమలమ్మ (80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. భర్తను కోల్పోయిన ఆమె తన నిరుపేద కుమారుడి వద్ద నివసిస్తూ జీవనం సాగించేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న వైష్ణవి, అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.5,000 నగదు సాయాన్ని తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అదే విధంగా ముదినేపల్లి గ్రామానికి చెందిన బొజ్జ మరియమ్మ (80) కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఒంటరిగా జీవనం సాగించిన ఆమె మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైష్ణవి స్పందించి, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా అందించారు.
ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవీయ విలువలను చాటుతున్న అంబుల వైష్ణవి, తండ్రి డాక్టర్ మనోజ్ సేవలను గ్రామస్తులు అభినందించారు. కష్టకాలంలో అందించిన ఈ సహాయం బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిచ్చిందని స్థానికులు పేర్కొన్నారు.....



