Ticker

6/recent/ticker-posts

గుడివాక లంక దాఖరపు సహస్ర చిన్నారి పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి, వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ( ఎల్ ఓ సి )ద్వారా రూ.2,68,000 రూపాయల సహాయాన్ని మంజూరు చేయించారు



 ✍🏼RSR NEWS✍🏼

🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao  9949291526🙏🏼✍🏼

గుడివాకలంక  దాఖరపు సహస్ర చిన్నారి పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి, వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ( ఎల్ ఓ సి )ద్వారా రూ.2,68,000 రూపాయల సహాయాన్ని మంజూరు చేయించారు


దెందులూరు నియోజకవర్గం – ఏలూరు
దెందులూరు నియోజకవర్గం, ఏలూరు మండలం గుడివాకలంక గ్రామానికి చెందిన దాఖరపు సహస్ర అనే చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, వైద్యం కోసం రెండు నెలల క్రితం కుటుంబ సభ్యులు దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారిని సంప్రదించారు. చిన్నారి పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి, వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ( ఎల్ ఓ సి )ద్వారా రూ.2,68,000 రూపాయల సహాయాన్ని మంజూరు చేయించారు.
ఆర్థిక సహాయం అందడంతో చిన్నారి సహస్రకు గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తై ప్రస్తుతం ఆరోగ్యకరమైన పరిస్థితిలో ఇంటికి చేరింది. చిన్నారికి మరో జన్మ ప్రసాదించినట్లుగా సహాయం అందించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలపడానికి సహస్ర కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఈరోజు ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమకు ముఖ్యమని, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్న సహాయాలను చేరవేయడం తమ బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో   ఏలూరు రూరల్ మండలం అధ్యక్షులు నంబూరి నాగరాజు గారు. క్లస్టర్ ఇంచార్జ్ నేతల రవి   టిడిపి యువనాయకులు జయమంగళ దొరబాబు (యూనిట్ ఇంచార్జ్), మోరు విజయరామరాజు (కో క్లస్టర్ ఇంచార్జ్), గంటసాల భద్రాచలం (టిడిపి నాయకులు), నేపాల జగపతి బాబు (వైస్ ప్రెసిడెంట్), గంటసాల కుటుంబరావు (సీనియర్ నాయకులు), గంటసాల సుబ్రహ్మణ్యం (పార్టీ ప్రెసిడెంట్), బలే వెంకటేష్ (బూత్ ఇంచార్జ్), మోరు శ్రీరామ్ (టిడిపి నాయకులు),     గెడ్డం సునీల్ కుమార్.. గెడ్డం రాజ్ కుమార్          గుడివాకలంక గ్రామానికి చెందిన టిడిపి నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.