Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మర్యాదపూర్వకంగా కలిసిన చందు వీరమాచనేని


ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)కి శుభాకాంక్షలు వెల్లువ


ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి)ను పడమరవీధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ చందు వీరమాచనేని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఏలూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణయ్య (చంటి) చందు వీరమాచనేనికి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అధ్యక్షులుగా చంటి నియామకం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, ఆయన నాయకత్వంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని చందు వీరమాచనేని ఆకాంక్షించారు.

అదేవిధంగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన బడేటి రాధాకృష్ణయ్య (చంటి) నాయకత్వంలో ఏలూరు జిల్లా అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని పలువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు ఇతర ముఖ్య కార్యకర్తలు పాల్గొని నూతన జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.