ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) నియమితులవ్వడం పట్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీ పట్ల నిబద్ధతతో పాటు ప్రజాసేవలో విశేష అనుభవం కలిగిన నాయకుడైన బడేటి రాధాకృష్ణయ్య నాయకత్వంలో ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో చంటి కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన కృషి మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, ఈ నియామకం పార్టీకి, జిల్లాకు శుభప్రదమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణయ్య(చంటి)కి ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

