Ticker

6/recent/ticker-posts

పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ అత్తగారైన శ్రీమతి ఘంటా అచ్చమాంబ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడింది




 RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

పెడపాడు మండలం – సత్యవోలు గ్రామం
పెడపాడు మండలం సత్యవోలు గ్రామంలో బీసీ నాయకులు  ఘంటా ప్రసాద్ రావు  తల్లి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్  అత్తగారైన శ్రీమతి ఘంటా అచ్చమాంబ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఘంటా రంగారావు – అచ్చమాంబ గార్ల విగ్రహాలను గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్  ఘంటా పద్మ శ్రీ ప్రసాద్  విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అచ్చమాంబ గారి సేవలను, వారి సాదాసీదా జీవన విధానాన్ని, గ్రామాభివృద్ధికి చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన , అచ్చమాంబ గారు గ్రామ ప్రజల పట్ల చూపిన ప్రేమ, సేవాభావం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆమె చూపిన మార్గంలోనే ప్రజలకు సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
అనంతరం గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆమె ఆధ్వర్యంలో ఆయుష్ హాస్పిటల్ వారి సహకారంతో సాధారణ వైద్య శిబిరం మరియు డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరాలలో అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని గ్రామ ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
వైద్య శిబిరంలో రక్తపోటు, షుగర్, సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు కంటి పరీక్షలు కూడా నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు, కంటి సమస్యలు ఉన్న వారికి తదుపరి చికిత్సపై వైద్యులు సూచనలు అందించారు.
గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ శిబిరాలకు హాజరై వైద్య సేవలను వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ శిబిరం ద్వారా ఎంతో లాభం పొందినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, వైద్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొని అచ్చమాంబ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమం మొత్తం ప్రశాంతంగా, క్రమబద్ధంగా సాగింది.