✍🏼RSR NEWS✍🏼
జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ తల్లికి సారె సమర్పించిన జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
జంగారెడ్డిగూడెంలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన సారె సమర్పణ కార్యక్రమం భక్తి భావంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె ఆలయానికి విచ్చేసి దేవి నూకాలమ్మ తల్లికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసి, భక్తులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని, ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.





