Ticker

6/recent/ticker-posts

ఏలూరు ఆశ్రమం కాలేజీ ప్రాంగణంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన “ఆశ్రమం చాలెంజర్స్ ట్రోఫీ –





 ఏలూరు, తేదీ:

ఆశ్రమం కాలేజీ ప్రాంగణంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన “ఆశ్రమం చాలెంజర్స్ ట్రోఫీ – దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్” లో ఆంధ్రప్రదేశ్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో సమష్టి ఆటతీరుతో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.50,000 నగదు బహుమతి అందజేసి ఘనంగా సత్కరించారు.


సందర్భంగా టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రత్యేకంగా ప్రశంస పత్రాలు మరియు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేసి అభినందించారు. దివ్యాంగులైనా క్రీడా రంగంలో తమ ప్రతిభను నిరూపించగలరని ఈ టోర్నమెంట్ మరోసారి చాటిచెప్పింది.


కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా డీఎస్‌డీవో అజీజ్ మాట్లాడుతూ, దివ్యాంగుల క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించేలా జిల్లా స్థాయిలో అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రీడల ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, దివ్యాంగుల ప్రతిభను వెలికి తీయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

కార్యక్రమంలో ఆశ్రమం కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు, గుప్తా ఫౌండేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఎన్ ఫౌండేషన్ అధినేత నారా శేషు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత మరియు మెన్ & ఉమెన్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ రెడ్డి, ఏలూరు జిల్లా క్రికెట్ అకాడమీ సెక్రటరీ మదన్ తదితరులు పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగిన ఈ టోర్నమెంట్‌లో రెండు రాష్ట్రాల క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పోటీపడి ప్రేక్షకులను అలరించారు. విజేతలైన ఆంధ్రప్రదేశ్ జట్టుకు పలువురు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహించి దివ్యాంగుల క్రీడలకు మరింత ఊతమివ్వాలని నిర్వాహకులు తెలిపారు.