✍🏼RSR NEWS✍🏼
🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao 9949291526🙏🏼✍🏼
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం పై రాష్ట్రవ్యాప్తంగా పరిరక్షణ యాత్ర చేపట్టనున్నట్లు వైఎస్ షర్మిల రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెడి శీలం వెల్లడించారు.
ఏలూరు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోరాడుతున్నదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందునే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై అపోహలు సృష్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు మాట్లాడుతూ, వైఎస్ షర్మిల రెడ్డి చేపట్టనున్న పరిరక్షణ యాత్రను ఏలూరు జిల్లాలో విజయవంతం చేయడానికి నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజ, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఆలపాటి నరసింహమూర్తి, పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.



