Ticker

6/recent/ticker-posts

దెందులూరు నియోజకవర్గంలో అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..*






 RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526
దెందులూరు నియోజకవర్గంలో అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..*


- *"రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యం కలిగించి మాలాంటి ఎంతో మందిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్ది ప్రజా సేవలో స్ఫూర్తి నింపిన మహనీయుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు - ఆయన తెలుగు వారిగా జన్మించటం మన తెలుగు ప్రజలకు గర్వకారణం": దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి*

*విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామం, దుగ్గిరాల కూడలి, దొండపాడు కమ్యూనిటీ హాల్ సెంటర్, దెందులూరు మండలం దెందులూరు గ్రామంలోని ఎన్టీఆర్ సర్కిల్ సహా పలు గ్రామాల్లో అన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ..*

*అనంతరం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ( చంటి) తో కలిసి అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించి వృద్ధులకు, మహిళలకు పండ్లు పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ కార్యక్రమంలో, వివిధ నామినేట్ పదవుల్లో ఉన్న నాయకులు, జిల్లా నాయకులు, కూటమి నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..