Editor: Chintapalli Srinivasarao 9949291526
హేలాపురి బ్రాహ్మణ యువజన సంఘ అధ్యక్షుడిగా నుదురుపాటి కృష్ణ చైతన్య శర్మ రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక
ఏలూరు, తేదీ:
బిజెపి ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి నుదురుపాటి కృష్ణ చైతన్య శర్మ గారు హేలాపురి బ్రాహ్మణ యువజన సంఘ నూతన అధ్యక్షులుగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘ సభ్యులు ఘన అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నుదురుపాటి కృష్ణ చైతన్య శర్మ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాల కాలంలో సంఘం అభివృద్ధి దిశగా అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని, ముఖ్యంగా ఏలూరు పట్టణంలో నివసిస్తున్న నిరుపేద అర్చకులు, పురోహితులకు సంఘం తరపున ఎన్నో సహాయ సహకారాలు అందించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, బ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ నూతన కార్యవర్గంలో
కార్యదర్శిగా – వెంపటి సాయి కృష్ణ శర్మ,
ఉపాధ్యక్షుడిగా – వెంపటి నాగేశ్వర శర్మ,
సహాయ కార్యదర్శిగా – తేజోమూర్తుల దీపక్ శర్మ,
కోశాధికారిగా – మాగంటి సుబ్రమణ్య శర్మ
నియమితులయ్యారు.
ఈ నూతన కమిటీ ఎన్నికల ప్రక్రియను సంఘ గౌరవాధ్యక్షులు గండికోట నాగేశ్వర శాస్త్రి, వెంపటి ఆంజనేయ శాస్త్రి గార్ల ఆధ్వర్యంలో సక్రమంగా నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో సంఘ సభ్యులు, పెద్దలు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో సంఘం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.



