RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
దెందులూరులో చింతమనేని పుట్టినరోజు సందర్భంగా అంబరాన్నంటిన సంబరాలు - చింతమనేనికి శుభాకాంక్షలు వెల్లువ*
* ఏలూరు న్యూస్ రైట్ ప్రతినిధి: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదినోత్సవం సందర్భంగా దుగ్గిరాల క్యాంపు కార్యాలయానికి వేలాదిగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు, అధికారులు, సిబ్బంది, అభిమానులు - శుభాకాంక్షలు తెలుపడానికి బారులు తీరిన వైనం - దాదాపు 5గంటలపైగా నిర్విరామంగా కొనసాగిన శుభాకాంక్షలు వెల్లువ - విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆత్మీయ విందు ఏర్పాటు చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ - తిరునాళ్లను తలపించిన దుగ్గిరాల గ్రామం*
*దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన పురస్కరించుకొని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ , పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు , దెందులూరు నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ , రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు , రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ దెందులూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి , ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ , ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిల్లపల్లి పార్థసారథి , ఏలూరు టౌన్ టిడిపి ప్రెసిడెంట్ చౌదరి వెంకటరత్నం నాయుడు , మాజీ ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ , అమరావతి ప్రసాద్ , ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు , చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి , ఏలూరు బిషప్ సెక్రటరీ ఫాదర్ థామస్ స్టీవెన్, ఫాదర్ రాజు, వికార్ జనరల్ ఫాదర్ బాల, జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు , నూజివీడు డిఎస్పి ప్రసాద్ , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా , జిల్లా విద్యుత్ శాఖ సూపర్ఇంటెండింగ్ ఇంజనీర్ సాల్మన్ రాజు , డి ఈ అంబేద్కర్ , దెందులూరు నియోజకవర్గ మండల పార్టీల అధ్యక్షులు, పలు సొసైటీల చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సహా పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు..*
*ఈ సందర్భంగా దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పలువురు యువకులు అభిమానులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు..*
*అదేవిధంగా ఎంతో అభిమానంతో తరలివచ్చిన దివ్యాంగుల వద్దకు సభా వేదిక వద్ద నుంచి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా వారి వద్దకే తరలి వెళ్లి కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించి వారికి అభినందనలు తెలిపారు..*





