Ticker

6/recent/ticker-posts

దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ప్రజావినతులు స్వీకరణ సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు దెందులూరు, శాసనసభ్యులు చింతమనేని



RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

 

దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ప్రజావినతులు స్వీకరణ

సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

దెందులూరు, శాసనసభ్యులు చింతమనేని

 

ఏలూరు" RSR"న్యూస్ ప్రతినిధి :దెందులూరు నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే వినిపించారు.

ఈ సందర్భంగా ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే సమీక్ష నిర్వహించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అధికారుల సమన్వయంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన భరోసా ఇచ్చారు.

గ్రామాల్లో నెలకొన్న త్రాగునీటి సమస్యలు, రహదారులు, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల పట్టాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి అర్జీపై నిర్దిష్ట గడువులో చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.