Ticker

6/recent/ticker-posts

పేదవాడి సంక్షేమానికి నాంది పలికిన మహనీయుడు స్వర్గీయ అన్న ఎన్టీయార్ - తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయుడు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని






 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao  9949291526

పేదవాడి సంక్షేమానికి నాంది పలికిన మహనీయుడు స్వర్గీయ అన్న ఎన్టీయార్ - తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయుడు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని 



 ఏలూరు న్యూస్ రైట్ ప్రతినిధి :: పేదవాడి సంక్షేమానికి నాంది పలికిన మహనీయుడు స్వర్గీయ అన్న ఎన్టీయార్ - తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయుడు - కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం రాబోతుంది - కొల్లేరు ప్రజలు త్వరలోనే మంచి వార్త వింటారు - ఎవరూ అధైర్య పడకండి - కూటమి ప్రభుత్వం తరపున, మీ ప్రతినిధిగా మీకు అన్ని విధాల అండగా ఉంటాను" : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి

ఏలూరు రూరల్ మండలం పైడిచింతపాడు గ్రామంలో స్థానిక టిడిపి నాయకులు ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ .


ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేకపోయినా అన్న నందమూరి తారకరామారావు గారిపై ఉన్న ఎనలేని అభిమానంతో పైడి చింతపాడు గ్రామ టిడిపి నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంత అభినందనీయమని, నూటికి నూరు శాతం కొల్లేరు అంశంలో న్యాయం జరిగేలా మీ ప్రతినిధిగా తాను అండగా ఉంటానని, కొల్లేరు అంశంలో కేంద్ర కమిటీలు వచ్చి పరిశీలించాయని, కొల్లేరు ప్రజల బాధలను గమనించారని, శాశ్వత పరిష్కారం కొల్లేరుకి త్వరలోనే రాబోతుందని తెలిపారు.. తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి నాయకుడు స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు అని, రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నాయకుడు మన అన్న నందమూరి తారకరామారావు గారు అని అన్నారు.. పేదవాడి సంక్షేమం కోసం సంస్కరణలు ప్రవేశపెట్టి తొలిసారిగా 35 రూపాయల ఫించన్తో సంక్షేమ కార్యక్రమాన్ని ఆనాడు ఆ మహానీయుడు ప్రారంభిస్తే ఈనాడు అది మరింతగా ఎదిగి ఎంతోమంది పేదలకు నెలకు 4వేల రూపాయలు వారి ఇంటి వద్దకు అందించేలా కొనసాగుతుంది అంటే ఆనాడు ఈ సంక్షేమ కార్యక్రమానికి నాంది పలికిన ఎన్టీ రామారావు గారికి ఆ ఘనత దక్కుతుందని అన్నారు, అదేవిధంగా బీసీలకు రాజ్యాధికారం కోసం బీసీల ప్రాధాన్యతను పెంచడానికి ఎంతగానో కృషి చేశారని అటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారి విగ్రహాన్ని పైడి చింతపాడు గ్రామంలో ఏర్పాటు చేసినందుకు ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు కల్పించినందుకు గ్రామ పార్టీ నాయకులకు కూటమి నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో కొల్లేరు సంఘం నాయకులు సైదు సత్యనారాయణ , గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ముంగర పెద్దిరాజు , గ్రామ పార్టీ సభ్యులు, పెదవేగి మండల పార్టీ ప్రెసిడెంట్ ఈడుపుగంటి అనిల్ , పెదపాడు పార్టీ ప్రెసిడెంట్ మరడానీ రవి , క్లస్టర్ ఇంచార్జ్ నేతల రవి , గుత్తా అనిల్ , ప్రత్తికొల్ల లంక సర్పంచ్ మువ్వల అశోక్ , ప్రత్తి కోళ్లలంక గ్రామ పెద్దలు, గుడివాకలంక గ్రామ పెద్దలు, యేసు రాజు, విజయవాడ కనకదుర్గ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు మోరు శ్రావణి , జాలిపూడి సొసైటీ చైర్మన్ మోటే పల్లి పవన్ , పెదవేగి సొసైటీ చైర్మన్ తాత సత్యనారాయణ , ఏలూరు పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి గుడిపూడి రేవతి , కో క్లస్టర్ ఇంచార్జ్ మోరు విజయరామరాజు, ఉప సర్పంచ్ రేలంగి యోహాను సహా పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు , మహిళలు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు