Ticker

6/recent/ticker-posts

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు




 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao  9949291526

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని, అలాగే ఏలూరు జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించారు.

ఈ దర్శన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు

చల్లా వెంకట సత్య వరప్రసాద్ (కంప్యూటర్ ప్రసాద్) ,

బెల్లపుకొండ కిషోర్ ,

జెర్రిపోతుల సత్యనారాయణ ,

పెనుమత్స శ్రీరామరాజు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

తిరుమలలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అత్యంత భక్తి భావంతో, శోభాయమానంగా సాగింది.