Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా ఎంపీ లాడ్స్ నిధులు రూ.64.08 లక్షలతో నిర్మించిన పోలీస్ విశ్రాంతి బ్యారక్స్ గదులను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ప్రారంభించారు.





 

RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

ఏలూరు జిల్లా ఎంపీ లాడ్స్ నిధులు రూ.64.08 లక్షలతో నిర్మించిన పోలీస్ విశ్రాంతి బ్యారక్స్ గదులను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ప్రారంభించారు.




ఏలూరు :

విధి నిర్వహణలో రేయింబవళ్ళు కష్టపడుతున్న పోలీసు సిబ్బందికి మెరుగైన విశ్రాంతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏలూరు 32వ డివిజన్‌ పరిధిలోని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఎంపీ లాడ్స్ నిధులు రూ.64.08 లక్షలతో నిర్మించిన పోలీస్ విశ్రాంతి బ్యారక్స్ గదులను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య , ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ , ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది ప్రజల రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్నారని, వారి ఆరోగ్యం మరియు విశ్రాంతి కోసం ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఈ బ్యారక్స్ గదులు పోలీసు సిబ్బందికి మెరుగైన విశ్రాంతి కల్పించి, వారి పని సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు.