Editor: Chintapalli Srinivasarao 9949291526
ఏలూరు, జనవరి 24 – 2026
ఏలూరులో నిర్వహించిన గంగనమ్మ జాతర సందర్భంగా సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ డాక్టర్ సింధు మాతాజీ అమ్మవారి దర్శనానికి విచ్చేశారు.
సాక్షాత్తు మహాశక్తి స్వరూపిణీ అయిన కాళీ మాత ఆరాధకురాలిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ సింధు మాతాజీ , భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం నిరంతరం సేవలందిస్తూ విశేష గుర్తింపు పొందారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో భద్రకాళీ పీఠంను ఏర్పాటు చేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో గురు భవన్ను స్థాపించి వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక గురువుగా మార్గనిర్దేశం చేస్తున్నారు.
అదేవిధంగా భవతారిణి ట్రస్ట్ ద్వారా పేదలకు, అనాధలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆశ్రయం కల్పించడం వంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తున్నారు.
గంగనమ్మ జాతర సందర్భంగా ఏలూరు తూర్పు వీధి మరియు పడమట వీధిలలోని అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం, ఆలయ కమిటీ సభ్యులు శ్రీ శ్రీ సింధు మాతాజీ మర్యాదపూర్వకంగా ఘనంగా అభినందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు పలువురు భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొని అమ్మవారి కృప పొందారు



