Ticker

6/recent/ticker-posts

ఏలూరు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రాధాకృష్ణయ్య

RSR NEWS

Editor: Chintapalli Srinivasarao

ఏలూరు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రాధాకృష్ణయ్య 

 ఏలూరు,RSR, ఎడిటర్ శ్రీనివాస్,, ప్రతినిధి : ఏలూరు, 

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు ఆర్‌ఆర్‌ పేటలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా బుధవారం నిర్వహించిన స్వామివారి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రథోత్సవాన్ని ప్రారంభించారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రథంపై కొలువుదీర్చిన స్వామి, అమ్మవార్లకు ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంగా రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని,, ఇందులో భాగంగా రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాలడుగు రమాదేవి, ధర్మకర్తలు ఈతకోట శ్రీనివాసరావు, గోకా నెహ్రూ బాబు, ఆలయ ఈవో ఎన్‌. సతీష్‌ కుమార్‌, ఆలయ ప్రధానార్చకులు కిళాంబి మారుతీ శ్రీనివాసా రామానుజాచార్యులు, అర్చకులు కోసూరి సత్యనారాయణాచార్యులు, వేద పండితులు యనమండ్ర వేంకట రవిప్రకాష్‌ శర్మ అవధాని, యాజ్ఞికులు కిళాంబి వేంకట పవన్‌ కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. రథోత్సవం ముందుకు కదులుతుండగా,, మహిళలు భక్తిపూర్వకంగా చేసిన కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఏలూరు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రాధాకృష్ణయ్య

ఏలూరు న్యూస్ రైట్ ప్రతినిధి : ఏలూరు,