Ticker

6/recent/ticker-posts

దివంగత వంగవీటి మోహన రంగా, బడేటి బుజ్జి వర్ధంతి సందర్భంగా ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యే కార్యక్రమం, పాల్గొన్న బడేటి





 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao

దివంగత వంగవీటి మోహన రంగా, బడేటి బుజ్జి వర్ధంతి సందర్భంగా ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యే కార్యక్రమం, పాల్గొన్న బడేటి



 ఏలూరు, RSR,న్యూస్,srinivas, ప్రతినిధి: ఏలూరు, 

 ప్రజాసేవతో ఆత్మబంధువులను సంపాదించుకున్న నేతలు ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రాధాకృష్ణయ్య పేర్కొన్నారు. ఇబ్బందుల్లో ఉన్న తోటి వారికి ఆపన్న హస్తం అందించడమే నిజమైన సేవా కార్యక్రమాన్ని ఆయన చెప్పారు. ఏలూరు జిల్లా పరిషత్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యేలు దివంగత వంగవీటి మోహన రంగా, బడేటి బుజ్జి వర్ధంతి సందర్భంగా ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత దివంగత నేతలకు నివాళులర్పిస్తూ ప్రత్యేక జ్యోతులను వెలిగించారు. అనంతరం వంగవీటి మోహన్ రంగా, బడేటి బుజ్జి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నిస్వార్థ ప్రజా సేవతో వంగవీటి మోహన్ రంగా, బడేటి బుజ్జిలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మీడియా రంగం అంతా అందుబాటులో లేని సమయంలో కూడా వంగవీటి మోహన్ రంగా తన ప్రజా సేవతో ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆయన చనిపోయి 37 సంవత్సరాలు అవుతున్నా మరో 370 ఏళ్ల వరకు ఆయన ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు అలంకరించిన తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే, దివంగత బడేటి బుజ్జి నిస్వార్ధమైన ప్రజాసేవతో నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. చేతికి ఎముకలేని విధంగా సాయమంటూ వచ్చిన వారికి ఎంతోకొంత సహాయం చేసి నిజమైన ప్రజానాయకుడు ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి చూపించిన గొప్ప వ్యక్తి బడేటి బుజ్జి అని కొనియాడారు. కేవలం మార్పు కోసం ఓడించిన ప్రజలు ఆయన మరణాన్ని చూసి తట్టుకోలేక ఆయన అంతిమయాత్రలో పాల్గొని ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటారన్నారు. నిజ నిజాలు తెలుసుకున్న ప్రజలు మొన్నటి ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో తనకు విజయాన్ని కట్టబెట్టి బడేటి బుజ్జి కి నిజమైన నివాళులు అర్పించారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వపరంగా అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్తూనే దాతల సహకారంతో అవసరార్థులకు తన వంతు సహకారం అందిస్తున్నానని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి 14 మంది విద్యార్థులకు ఫీజులు కడుతూ వస్తున్నానని, వచ్చే ఏడాది 120 మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అనంతరం ఫ్లాష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మూడు మార్చురీ బాక్స్ లను ఉచిత అంతిమ సేవలకు ఆయన అందజేశారు. అలాగే వృద్ధులకు హ్యాండ్ స్టిక్స్ పంపిణీ చేశారు. అలాగే కొల్లి హరీష్ ఆధ్వర్యంలో 10 తోపుడు బండ్లను పేద వ్యాపారస్తులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఫ్లాష్ శ్రీనివాస్ మరియు ఫ్లాష్ టీం సభ్యులు, మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు......

RSR NEWS

Editor: Chintapalli Srinivasarao