Ticker

6/recent/ticker-posts

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాల్లో నూటికి నూరుశాతం విజయం సాధించి ఆ విజయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా అందిస్తామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుశాతం విజయం సాధిస్తాం – బడేటి చంటి

ఏలూరు,,RSR, ఎడిటర్ శ్రీనివాస్,న్యూస్ ప్రతినిధి:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాల్లో నూటికి నూరుశాతం విజయం సాధించి ఆ విజయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా అందిస్తామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు.

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పార్టీ ప్రకటించిన అనంతరం సోమవారం ఏలూరులోని జిల్లా టీడీపీ కార్యాలయాన్ని బడేటి చంటి సందర్శించారు. ఈ సందర్భంగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మతపెద్దలు బడేటి చంటిని ఆశీర్వదించారు.

వైసీపీ చిల్లర రాజకీయాలకు అడ్డుకట్ట

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ నాయకులు చేస్తున్న చిల్లర రాజకీయాలకు గట్టి సమాధానం చెబుతామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం సహించదని, కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

కల్తీ సారా మరణాలపై సిట్ నివేదిక చెంపపెట్టు

వైసీపీ ప్రభుత్వ హయాంలో జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ సారా మరణాలను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయితే సిట్ నివేదిక ద్వారా అవి కల్తీ సారా మరణాలేనని స్పష్టమైందని, ఈ నివేదిక జగన్‌కు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు, అప్పటి నాయకులు తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తారని తెలిపారు.

పార్టీ బలోపేతమే లక్ష్యం

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పూర్తి బాధ్యతతో పని చేస్తానన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక చేసి నూరుశాతం విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చారు. తనను రికార్డు మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

వారానికి నాలుగు–ఐదు రోజులు పార్టీ కార్యాలయంలో అందుబాటు

ఇకపై జిల్లా పార్టీ కార్యాలయంలో అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు వారానికి నాలుగు నుంచి ఐదు రోజులు కార్యాలయానికి వస్తానని, సమయాలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు.

పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, జిల్లా ఉపాధ్యక్షులు గూడవల్లి వాసు, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు జంపా సూర్యనారాయణ, అహ్మద్ ఖాజాషేక్, కార్యదర్శి చింతాటి జ్యోతి, సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.