Ticker

6/recent/ticker-posts

దెందులూరు నియోజకవర్గం పరిధిలోని మాదేపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడినవి










 '✍🏼"RSR న్యూస్""✍🏼

✍🏼ఎడిటర్: ""✍🏼చింతపల్లి శ్రీనివాసరావు""" 9949291526""✍🏼



దెందులూరు నియోజకవర్గం పరిధిలోని మాదేపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

ఈ పవిత్రమైన గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో హాజరు, స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించి పుణ్యఫలాన్ని పొందారు. మంగళ వాయిద్యాల నాదం మధ్య, వేద పండితుల వేద మంత్రోచ్చారణలతో, అర్చకుల సమక్షంలో కళ్యాణ వేడుకలు అత్యంత ఘనంగా సాగాయి.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. స్వామివారి అలంకార దర్శనం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేలా ఆకట్టుకుంది. భక్తులు గోవింద నామస్మరణతో, భజనలతో, హారతులతో స్వామివారిని ప్రార్థించారు.
కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, భక్తులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ పవిత్ర వేడుక గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచింది.

ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేరాలని, నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
“ఓం నమో వేంకటేశాయ” నినాదాలతో ఆలయం మార్మోగింది.