✍🏼RSR NEWS✍🏼
🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao 9949291526🙏🏼✍🏼
🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao 9949291526🙏🏼✍🏼
దెందులూరు, ఫిబ్రవరి 13:
దెందులూరు నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరంలో మొత్తం 280 మంది ప్రజలు ఉచిత కంటి పరీక్షలు చేయించుకుని వైద్య సేవలు పొందారు.
రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ బాబు ఆధ్వర్యంలో, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు కంటి సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
స్థానిక లైబ్రరీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ హేమలత మరియు వారి వైద్య బృందం పాల్గొని ఆధునిక కంప్యూటర్ పద్ధతుల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, రక్తపోటు పరీక్షలతో పాటు దీర్ఘదృష్టి, హస్వదృష్టి, కంటి నరాల సమస్యలు, కంటి శుక్లాలు, దృష్టిలోపం వంటి అనేక సమస్యలను గుర్తించి తగిన వైద్య సూచనలు అందించారు.
ఈ శిబిరంలో 76 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించి చర్యలు చేపట్టగా, 127 మందికి ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేశారు. చిన్నపిల్లలలో కనిపించే మసక దృష్టి, కంట్లో నీరు కారటం, కండ్ల కలకలు వంటి సమస్యలపై డాక్టర్ హేమలత అవగాహన కల్పించారు.
సొసైటీ ప్రెసిడెంట్ గారపాటి కొండయ్య చౌదరి మాట్లాడుతూ మహేష్ బాబు ప్రజలకు అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. కరోనా కాలంలో కూడా ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
సత్యనారాయణపురం, అలుకులగూడెం, అప్పారావుపాలెం, దెందులూరు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ శిబిరానికి హాజరయ్యారు. దెందులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు సేవలందించారు.
రాబోయే కాలంలో కూడా ప్రజలకు అవసరమైన మరిన్ని సేవలు అందించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పెనుబోయిన మహేష్ బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి.సుమతి, ఎస్ఐ శివాజీ, హాస్పిటల్ కమిటీ చైర్మన్ కలపాల శ్రీహరి, ఇప్పిలి వెంకటేశ్వరరావు, సంపంగి తిలక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కేటివి భాస్కర్, సర్పంచ్ తోట ఏసమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు పెనుబోయిన శేషారత్నం, వేమూరి మురళి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్.కె.జహీర్, మన్నెం స్వామి, మేడిద రీతివి, కూరపాటి కిషోర్, టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


